తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: చందానగర్‌ డివిజన్ లోని పీజెఆర్ స్టేడియం ఆవరణలో జననేత, మాజీ కేంద్ర మంత్రి, దివంగత పి. జనార్దన్ రెడ్డి కాంస్య విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఏసీ ఛైర్మెన్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికపూడి గాంధీ, స్వర్గీయ పీ. జనార్దన్ రెడ్డి కుమార్తె ఖైర్తాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పీ. విజయ రెడ్డి , యాదవ కోఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మెన్ మారబోయిన రఘునాథ్ యాదవ్, తదితర గౌరవ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, ప్రముఖులతో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ మంత్రి , ఎమ్మెల్యే , తదితర ప్రముఖులతో కలిసి పిజెఆర్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ , కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ, స్వర్గీయ, మాజీ కేంద్ర మంత్రి, గౌరవ పి. జనార్దన్ రెడ్డి తన రాజకీయ జీవితమంతా పేదల పక్షపాతిగా, కార్మికుల ఆశాజ్యోతిగా నిలిచారని కొనియాడారు. హైదరాబాద్ నగరాభివృద్ధికి, ముఖ్యంగా చందానగర్, శేరిలింగంపల్లి ప్రాంతాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన పి.జె.ఆర్ సేవలు నేటితరం నాయకులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అనంతరం, పీజెఆర్ స్టేడియంలో నూతనంగా ఏర్పాటుచేసిన విజయ డైలీ పార్లర్ ను ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితర డివిజన్ల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, పిజెఆర్ అభిమానులు, శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.