తెలంగాణ ఎక్స్ ప్రెస్ కామారెడ్డి(జూలై 16): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో సీటీ స్కాన్ లేక రోగులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరు యూజీ వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో యంత్రాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అందులో కామారెడ్డి ఒకటి కానీ ఇప్పటికీ సీటీ స్కాన్ యంత్రం ఆసుపత్రికి అందలేదు.

ప్రమాదాల బారిన పడిన క్షతగాత్రులను కామారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చి సకాలంలో వైద్యం అందిస్తున్నారు అయినప్పటికీ కొందరికి అత్యవసరంగా సీటీ స్కాన్ చేయించాల్సి వచ్చినప్పుడు నివేదిక ఆధారంగా చికిత్స అందించాల్సి ఉండటంతో క్షతగాత్రులు తప్పనిసరిగా ప్రైవేటు కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి దీనివల్ల మధ్యతరగతి కుటుంబాల వారికి ఆర్ధికంగా భారం పడుతుంది.

కామారెడ్డి జీజీహెచ్కు గతంలో సీటీ స్కాన్ యంత్రం మంజూరు కావాల్సి ఉన్నా కొందరు కావాలని ప్రతిపాదనలు పంపలేదు. జిల్లాకేంద్రంలో ప్రైవేటు స్కాన్ కేంద్రాన్ని కొందరు వైద్యుల కనుసన్నల్లో నిర్వహించారు. దీంతో అనేక సంవత్సరాల నుంచి ప్రమాదాల బారినపడిన వారు స్కానింగ్ కోసం రూ.2500 నుంచి రూ.4500 వరకు వెచ్చిస్తున్నారు.

ఈ విషయమై బోధన్ ఆసుపత్రి ఆర్ఎంవో సంతోష్ ప్రస్తుతమున్న ఆసుపత్రిలో స్థలం లేని కారణంగా టీ హబ్ కేంద్రం లేదా ఆర్టీపీసీఆర్ ప్రయోగశాలలో సీటీ స్కాన్ యంత్రం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించామన్నారు. సిటీ స్కాన్ యంత్రం ఏర్పాటు చేసేందుకు మరోసారి ఉన్నతాధికారులతో చర్చిస్తామన్నారు.