తెలంగాణ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీసీ కుల సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్ ఫీజు రీయింబర్స్ మెంట్ కొరకు ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష ద్వారా విద్యార్థులకు ఫీజు బకాయిలు, స్కాలర్షిప్లు, ఉద్యోగాలు, తక్షణమే అందజేయాలని చేపడుతున్న దీక్షకు ఎప్పుడూ మద్దతుగా నిలుస్తామని డిమాండ్ పేర్కొన్నారు. బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ, ప్రభుత్వం అన్ని విధాల విద్యార్థులకు అండగా నిలిచి ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలి చెల్లించాల్సి ఉందన్నారు. విద్యార్థులు భవిష్యత్తుల దృష్టిలో ఉంచుకొని ఫీజులు, స్కాలర్షిప్లు, ఉద్యోగాలు, తక్షణమే విడుదల చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల కోసం ఆర్ కృష్ణయ్య చేపట్టే ఇలాంటి దీక్ష కైనా తాము అండగా నిలుస్తామని తెలిపారు. హైదరాబాదులోని ధర్నా చౌక్ వద్ద ఆర్ కృష్ణయ్య చేపట్టిన దీక్షకు అనూహ్య స్పందన లభించిందన్నారు. విద్యార్థుల కోసం చేస్తున్న దీక్షకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం, ఆర్ కృష్ణయ్య ను కలిసి ఆయన ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో భేరి రామచందర్ యాదవ్ తో పాటు తెలంగాణ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్ కె.సాయన్న ముదిరాజ్, తెలంగాణ రాష్ట్ర బీసీ కుల సంఘాల ఐక్యవేదిక, మేదరి మహేంద్ర సంఘం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు కొంటు ముకుందం, తెలంగాణ రాష్ట్ర బీసీ కుల సంఘాల ఐక్యవేదిక, బిసి ఫెడరేషన్ ముఖ్య సలహాదారు పట్లూరి కృష్ణమోహన్, గండి మైసమ్మ అధ్యక్షులు రాజశేఖర్ యాదవ్, పులి రాజేందర్, నోముల ప్రవీణ్ కుమార్, బీసీ నాయకులు అన్నా నగర్ అధ్యక్షులు శ్రీశైలం గౌడ్, ఉప్పల్ అధ్యక్షులు ఎంవిఎస్ నాయక్, కీర్తి కుమార్, కుల్చారం అధ్యక్షులు మురళీధర్, గజ్వేల్ అధ్యక్షులు ఇస్మాయిల్, యువజన అధ్యక్షులు కొంటు సుమన్, సిద్ధార్థ ముదిరాజ్, శీను పటేల్, అనేకమంది బీసీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో బేరితో పాటు మద్దతుగా నిలిచి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
