తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కాటేదాన్ డివిజన్ పరిధి టాటా నగర్‌లో శ్రీ జగన్నాథ రథయాత్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాటేదాన్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎస్. వెంకటేష్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, జగన్నాథ రథయాత్ర సందర్భంగా భక్తుల కోలాహలం, హరేకృష్ణ నామస్మరణలు, భక్తి కీర్తనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సంకీర్తనలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయని తెలిపారు. అనంతరం స్వామివారికి మహా హారతి సమర్పించి, ప్రజలందరికీ శుభాలు కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కాటేదాన్ డివిజన్ కార్మిక విభాగం అధ్యక్షుడు ఉప్పల్ శీను, కిలారి వెంకటరమణ, భీమ రాయుడు, నరేష్, వీరస్వామి, మోహన్, రిషి, గణేష్, సుధామా, బాపి, బాబు, సిద్ధూ, రామ్, పింటూ, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన శ్రీ జగన్నాథ స్వామి భక్తులు పాల్గొన్నారు.