తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: హిమగిరి నగర్ కాలనీ సభ్యులు హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలి (హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బీ) కిస్మత్‌పూర్ కార్యాలయ మేనేజర్ నరేష్‌ను కలిసి, ఇప్పటికే పరీక్షలు పూర్తి చేసి వినియోగానికి సిద్ధంగా ఉన్న కొత్త తాగునీటి పైప్‌లైన్ ద్వారా వెంటనే నీటి సరఫరా ప్రారంభించాలని శనివారం వినతిపత్రం అందజేశారు.దీనిపై స్పందించిన నరేష్, వారం రోజుల్లోపు కొత్త పైప్‌లైన్ ద్వారా హిమగిరి నగర్ కాలనీకి క్రమం తప్పకుండా తాగునీటి సరఫరా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో హిమగిరి నగర్ కాలనీ సభ్యుడు రవి రాజా, యాదయ్య, శాస్త్రి, వెంకటేశ్వర్, మణి, సంతోష్, గణేష్, కిరణ్, శివ, అమిత్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని హిమగిరి నగర్ కాలనీ సభ్యుడు రవి రాజా సమన్వయం చేశారు. కాలనీకి శాశ్వత, క్రమబద్ధమైన తాగునీటి సరఫరా కోసం ప్రతి కాలనీ వాసి ఐక్యంగా పాల్గొని సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. అందరి సహకారంతో ఈ లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.