తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హైదర్‌గూడ డోనాల్డ్ స్కూల్‌లో బూత్ నంబర్లు 238, 239, 240, 241కు సంబంధించిన శక్తి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) హెల్ప్‌డెస్క్‌ను రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు, రాజేంద్రనగర్ అసెంబ్లీ ఎస్‌ఐఆర్ ఇన్‌చార్జి తొండ రవి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రజాస్వామ్యాన్ని కాపాడే వజ్రాయుధమని పేర్కొన్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎన్యుమరేషన్ ఫారాన్ని నింపి సమర్పించాలని, చివరి రోజు వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
ఎన్యుమరేషన్ ఫారాలు అందని ఓటర్లు తమ ఓటర్ గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డుతో హెల్ప్‌డెస్క్‌ను సంప్రదిస్తే, సంబంధిత బీఎల్‌ఓ వద్ద ఫారం వివరాలను కార్యకర్తలు యాప్ ద్వారా పరిశీలించి అందిస్తారని తెలిపారు. ఫారాలను సమర్పించిన వారికే ఆగస్టు 10 తర్వాత ఓటరు వివరాల్లో మార్పులు, చేర్పులు, సవరణలు చేసుకునే అవకాశం ఉంటుందని, లేకపోతే ఓటు తొలగించబడే అవకాశం ఉందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సోషల్ మీడియా జాయింట్ కన్వీనర్ మధుమోహన్ రెడ్డి, వరుణ్ రాజే, రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయ కార్యదర్శి సాబాద విజయ్ కుమార్, అత్తాపూర్ డివిజన్ అధ్యక్షుడు సులిగే వెంకటేష్, బీఎల్‌ఏ–2 నారగూడెం సోంనాథ్ రెడ్డి, సీనియర్ నాయకుడు చెట్టిగారి శేఖర్, కవేలిగూడెం బాలు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.