తెలంగాణ ఎక్స్ ప్రెస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, రాఘవేంద్ర కాలనీలో 19వ తేదీ ఆదివారం నూతనంగ ఏర్పాటుచేసిన ఆల్ఫా స్పోర్ట్స్ అండ్ మార్షల్ ఆర్ట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా కొండాపూర్ డివిజన్ బీబిఆర్ఎస్ పార్టీ నాయకులు మహమ్మద్ అలావుద్దీన్ పటేల్ పాల్గొని ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. అనంతరం, మహమ్మద్ అలావుద్దీన్ పటేల్ మాట్లాడుతు, ఆల్ఫా స్పోర్ట్స్ అండ్ మార్షల్ ఆర్ట్స్ ను ఈ ప్రాంత వాసులకు అందుబాటులోకి తీసుకువచ్చినందుకు యాజమాన్యం వారైన రాముకి హృదయపూర్వక అభినందనలు తెలియజేసారు. ఈ అకాడమీ విద్యార్థులలో శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తూ, వారిలోని సామర్థ్యాన్ని వెలికితీయడానికి సహాయపడుతుందని, ఈ ఆల్ఫా స్పోర్ట్స్ అండ్ మార్షల్ ఆర్ట్స్ బృందానికి భవిష్యత్తులో అంతా మంచే జరగాలని ఆకాంక్షిస్తు శుభాకాంక్షలు తెలిపారు.