తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ , ఎక్స్ పీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు హాజరై కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపారు. సమాజ సేవకు ప్రాధాన్యతనిస్తూ మిరియాల ప్రీతమ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ , గిడుగు రుద్రరాజు, చేతుల మీదుగా విద్యార్థులకు బ్యాగులు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన సహాయం అందించడం ద్వారా మిరియాల ప్రీతమ్ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు విహెచ్ హనుమంతరావు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ కాంగ్రెస్ పార్టీ శేర్లింగంపల్లి ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఎంబీసీ మాల్ చైర్మన్ జెర్రీపాటి జైపాల్ మాజీ తాజా కార్పొరేటర్ రఘునాథరెడ్డి మెట్టు కుమార్ యాదవ్ రాగం నాగేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు మిరియాల ప్రీతమ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.