తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం:
యువనాయకులు మిరియాల ప్రీతం జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు వి. హనుమంత్ రావు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్ , పీసీసీ జనరల్ సెక్రటరీ ఆర్ లక్ష్మణ్ యాదవ్ , పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ , సీనియర్ నాయకులు మిరియాల రాఘవరావుతో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ, ప్రీతం యువతకు ఆదర్శంగా నిలుస్తూ ప్రజా సేవలో ఎల్లప్పుడూ ముందుంటారని కొనియాడారు. డివిజన్ అభివృద్ధి కోసం యువ నాయకత్వం ఎంతో అవసరమని, ప్రీతం లాంటి యువకులు మరింత ముందుకు వచ్చి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సోమదాస్, మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, సీనియర్ నాయకులు, కొండల్ రెడ్డి, శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్, వినయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
