తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: తెలంగాణ రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా ప్రజల ఆరోగ్యంపై రాజీలేని విధానాన్ని అమలు చేస్తుందని శాసనసభ్యులు, పి ఏ సి చైర్మన్ అరికెపూడి గాంధీ పేర్కొన్నారు. పీజేఆర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన విజయ డైరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న రోజుల్లో పీజేఆర్ స్టేడియంను ఎవరు ఊహించని స్థాయిలో అభివృద్ధి చేస్తామని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డైరీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అధికమించలన్న లక్ష్యంతో మహిళలను స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించే క్రమంలో పీజేఆర్ స్టేడియంలో ప్రభుత్వ రంగ సంస్థ విజయ డైరీని ఏర్పాటుచేశారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై ఉత్తమమైన సేవలు ఓపికతో అందించి విజయ డైరీ సంస్థను బలోపేతం చేసేందుకు క్రమశిక్షణ తో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విజయ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, రఘునాథ్ రెడ్డి, రఘునందన్ రెడ్డి, నాగేందర్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు
