తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో శ్రీ జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది. బంజారాహిల్స్ ఇస్కాన్ టెంపుల్ మరియు హరే కృష్ణ సభ్యుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఆధ్యాత్మిక వేడుకను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ యాదవ కురుమ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ రఘునాథ్ యాదవ్ ప్రత్యేక పర్యవేక్షణలో జరిగిన ఈ పవిత్ర యాత్రలో శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని, జగన్నాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పవిత్ర యాత్రకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. హరినామ సంకీర్తనలు, భక్తుల జయజయధ్వానాల మధ్య జగన్నాథుడి రథం ముందుకు సాగింది. భక్తులంతా స్వామివారిని దర్శించుకుని, పూజలు నిర్వహించి తరించారు.
