తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్:చిన్నకోడూరు మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మంద శ్రీకాంత్‌కు ఆదివారం నియామక పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు, జిల్లా చైర్మన్ తప్పేట శంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ మీసం మహేందర్ యాదవ్ సూచనలతో నియామకం జరిగింది. అదేవిధంగా, అనంతసాగర్ గ్రామానికి చెందిన మెట్ల అజయ్‌ను ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా నియమించారు.
ఈ కార్యక్రమంలో నంగునూరు మండల మార్కెట్ కమిటీ చైర్మన్ దేవలపల్లి యాదగిరి, డిసిసి జనరల్ సెక్రెటరీ సందబోయిన పరశురాములు, ఎస్సీ సెల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కాటన్ కిషన్, జిల్లా కన్వీనర్ పొన్నాల రాజేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కొమ్ము ప్రశాంత్ పాల్గొన్నారు. అలాగే పార్టీ సీనియర్ నాయకులు గొట్టిపర్తి చందు, అంతగిరి చంద్రశేఖర్, అశోక్, సంజీవ్, రాజు, శంకర్, పుట్ల యేసు, సత్తన్న తదితరులు పాల్గొని నూతన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.

You missed