తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన యువ నాయకుడు మిరియాల ప్రీతమ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై మిరియాల ప్రీతమ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్న ఆరికెపూడి గాంధీ, మిరియాల ప్రీతమ్ ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని మిరియాల ప్రీతమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.