తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా నేడు మున్సిపాలిటీ పరిధి నిన్న అనగా 22-7-2026 వ రోజు ధర్మన్న కాలనీ 25 వ వార్డులో రోడ్లు బురదగా ఉండటం వలన కౌన్సిలర్ నర్రా సంధ్య శ్రావణ్ బురదలో కూర్చొని నిరసన కార్యక్రమానికి స్పందించిన మున్సిపల్ అధికారులు ఈ సంద ర్భంగా ధర్మన్న కాలనీ 25 వ వార్డు కమిటీ కన్వీనర్ జిల్లా కౌన్సిల్ సభ్యు లు నర్రా శ్రావణ్ మాట్లాడుతూ స్థాని క సంస్థల ఎన్నికలకు ముందుఎంతో హట్టహాసంగా ధర్మన్న కాలనీ 25వ వార్డులో రోడ్లు డ్రైన్లు మరియుపలు అభివృద్ధి పనులపై శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించకుండా అలస త్వం పై కౌన్సిలర్ నర్రాసంధ్య శ్రావణ్ బురుదలో కూర్చొని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి స్పందించి మున్సిప ల్ అధికారులు ఏఈ సౌజన్య తో వార్డు కమిటీ కన్వీనర్ సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు నర్రా శ్రావణ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు శాసన సభ్యులు డాక్టర్ మురళి నాయక్ ఎంతో అట్టహాసంగా పలు అభివృద్ధి పనులపై శంకుస్థాపనలు చేశారని కానీ నేటి వరకు కూడా అభివృద్ధి పనులు ప్రారంభానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభించాలని ఏఈ సౌజన్యను కోరగా సానుకూలంగా స్పందించిన మున్సిపల్ అధికారి ఏఈ సౌజన్య రెండు నుండి మూడు రోజుల గడువులో కాంట్రాక్టర్ తో మాట్లాడి పనులు చేయించడానికి ముందు కాంట్రాక్టర్ ను వార్డు కు పంపిస్తానని హామీ ఇచ్చారని తెలియచేశారు లేనియెడలో రోడ్లు డ్రైన్లు వేసేంతవరకు దశలవారీగా పోరాటాలకు పూనుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్క్ ఇన్స్పెక్టర్ కాగితం శ్రీనివాస్ తో పాటు 25వ వార్డు సిపిఐ కమిటీ సభ్యులు మంద శంకర్ దారమల్ల మహేష్ మొలకలపల్లి సమ్మక్క ఉపేంద్ర అనూష సులోచన తండా శ్రీనాథ్ రాకేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.