తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : నేడు మహబూబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో ఢిల్లీలో విద్యార్థుల పైహింస కాండను నిరసిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అందుకు బాధ్యత నరేంద్ర మోడీ వహించాలని కోరుతూ స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందట నిరసన ఆందోళన చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి మాట్లా డుతూ ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం విద్యార్థులపై చేస్తున్న లాఠీ చార్జ్ హింసకాండను ఆపాలని వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా దేశ రాజధానిలో విద్యార్థు లపై ధమనకాండ జరుగుతున్న ప్రేక్షక పాత్ర వహిస్తున్న నరేంద్ర మోడీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు వెంటనే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు దేశవ్యా ప్తంగా ప్రజలు విద్యార్థులు బిజెపి సర్కార్ పై ఆవేశంతో ఉన్నారని నీట్ పరీక్ష లీకై విద్యార్థులు చనిపోతుంటే నరేంద్ర మోడీ పట్టించుకో వడం లేదన్నారు చనిపోయి న విద్యార్థులకు ఒక్కొక్కరి కికోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు మంత్రి వర్గం నుండి ధర్మేంద్ర ప్రధాన్ ను భర్తరాఫ్ చేయాలన్నారు మోడీ ప్రభుత్వం దేశంలో కార్పొరేట్ లకి ఊడిగం చేస్తుందన్నారు ఈ సంద ర్భంగా పోలీసులకు సిపిఐ నేతలకు గలాటా కాగా ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మ దగ్ధం చేయకుండా ఆపిన పోలీసులు గలాటా జరగగా ఎట్టకే లకు సిపిఐ నేతలు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెరుగు కుమార్ దేశ పల్లి నవీన్ చింతకుంట్ల వెంకన్న మామిండ్ల సాంబలక్ష్మి కట్లోజు పాండురంగ చారి తండ సందీప్ నర్రా శ్రావణ్ వెలుగు శ్రవణ్ మేక వీరన్న బానోతు లింగ్య నాయక్ మాలో త్ రవీందర్ కేదాసు రమేష్ పాల్ చిరంజీవి ఎండి మహమూద్ ఆబోతు అశోక్ తదితరులు పాల్గొన్నారు.