తెలంగాణ ఎక్స్ ప్రెస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్ఎల్ఏ ఆరెకపూడి గాందీ, ఆధ్వర్యంలో మియాపూర్ లోని ఎమ్ఎల్ఏ క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలో నిర్వహిస్తున్న “సర్” కార్యక్రమంలో భాగంగా బీఎల్ఓ లు, బీఎల్ఏ లు నాయకులతో కలిసి వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “సర్” కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని, మీ పేరు ఓటరు జాబితాలో నమోదై ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, ప్రతి అర్హత కలిగిన పౌరుడు తన ఓటరు నమోదు వివరాలు సరైనవిగా, తాజాగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని కోరారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకులు, తాజా మాజీ కార్పోరేటర్లు, పాపిరెడ్డి నగర్ లోని సీనియర్ మహిళా నాయకురాలైన కే. కనక లక్ష్మి, బీఎల్ఓ లు, బీఎల్ఏ లు తదితరులు పాల్గొన్నారు.