హైదరాబాద్: బీసీల రాజకీయ, సామాజిక, విద్యా, ఆర్థిక హక్కుల సాధనే లక్ష్యంగా మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కటకం నర్సింగ్ రావు అధ్యక్షతన చారిత్రాత్మక బీసీ రౌండ్ టేబుల్ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీల సమగ్ర అభివృద్ధి, రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ, రాజకీయ సాధికారతపై విస్తృతంగా చర్చించి పలు కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, బీసీల హక్కుల సాధన కోసం జరుగుతున్న ఈ ఉద్యమం ఒక వ్యక్తి లేదా ఒకే సంస్థకు పరిమితమైంది కాదని, మొత్తం బీసీ సమాజం భవిష్యత్తు కోసం సాగుతున్న సామాజిక ఉద్యమమని పేర్కొన్నారు. “ఐక్యతే బలం… రాజ్యాంగమే మన ఆయుధం… సామాజిక న్యాయమే మన లక్ష్యం” అనే నినాదంతో ప్రతి బీసీ సంఘం, సంస్థ, నాయకుడు ఒకే వేదికపైకి రావాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు, BC జేఏసీ స్టేట్ కోఆర్డినేటర్ గుజ్జ సత్యం, వట్టే జానయ్య యాదవ్, తెలంగాణ విట్టల్, జక్కిన్ని సంజయ్, బత్తుల సిద్దేశ్వర్, చామకూర రాజు, కోలా జనార్దన్, వాసు కె. యాదవ్, కేవీ గౌడ్, చిత్తరంజన్, చాపర్తి కుమార్ గాడ్గే, కురుమూర్తి, గోద మల్లికార్జున్ గౌడ్ తదితర బీసీ నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.
బీసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు పూర్తిస్థాయిలో అమలయ్యే వరకు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని, రాష్ట్రవ్యాప్తంగా ఐక్య కార్యాచరణతో ముందుకు సాగుతామని సమావేశంలో నాయకులు స్పష్టం చేశారు.
