తెలంగాణ ఎక్స్ ప్రెస్: శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్ఎల్ఏ యువ డైనమిక్ లీడర్ రవికుమార్ యాదవ్ ఆదేశాల మేరకు, శేరిలింగంపల్లి డివిజన్ కాంటెస్టెడ్ కార్పోరేటర్ ఎల్లేష్ ఆదేశాల మేరకు పాపిరెడ్డి నగర్ లోని సీనియర్ బీజేపీ నాయకులైన టీ. నర్సింలు, వి. శ్రీనివాస్, విజయ లక్ష్మీ, అజయ్ కుమార్, బాలు, సుబ్బు, ఫిన్నీ బాబు, శ్యామ్ రాజు, మీనమ్మ, స్వప్న, రాజమణి., సుధా ,ఎమ్ ఎస్ రావు ల ఆధ్వర్యంలో బీఎల్ఏ.లు పాపిరెడ్డి నగర్, రాజీవ్ గృహకల్ప , ఆరంభ టౌన్ షిప్ లోని బూత్ నెంబర్ లు181, 182 ,170,172,176, 164,165 బూత్ నెంబర్ లలో ఇంటింటికి వెళ్లి సర్ ఓటర్ జాబితాను సక్రమంగా సేకరించారు. ఈ సందర్బంగ వారు మాట్లాడుతు, ఓటర్లు తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని, ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సర్ కార్యక్రమంలో ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా భాగస్వామి కావాలని కోరారు. బిఎల్ఓలు అందజేసే ఎమ్యూనరేషన్ ఫారంలో తమ పూర్తివివరాలను సక్రమంగా నమోదుచేసి ఓటు హక్కును పరిరక్షించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలంటే ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఓటరుగా నమోదు కావడం అత్యంత ముఖ్యమని ప్రజలకు అవగాహన కల్పించారు.
