తెలంగాణ ఎక్స్ ప్రెస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొత్తగూడలోని పలుచోట్ల మురుగునీటి పైపుల శుభ్రతలో సహకరించిన హెచ్ఎం డబ్ల్యూ ఎస్ ఎస్ బి. అధికారులు అరుణ్ కుమార్ కు, సిబ్బందికి కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు ఎండి అలావుద్దీన్ పటేల్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్బంగ అలావుద్దీన్ పటేల్ మాట్లాడుతు, ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించి అనారోగ్యాల బారిన పడకుండా కాపాడాలనేదే మా ఉద్దేశ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంతోష్, మమత, బలరాజ్ తదితరులు పాల్గొన్నారు.
