తెలంగాణ ఎక్స్ ప్రెస్: శేరిలింగంపల్లి డివిజన్, రాజీవ్ గృహకల్ప, పాపిరెడ్డి కాలనీలో సర్ కార్యక్రమాన్ని స్థానిక సీనియర్ నాయకులైన రమేష్ స్వయంగా ఇంటింటికి వెళ్ళి సర్ గురించి అందరికీ అవగాహన కల్పిస్తూ ఫారాలను పూర్తిచేస్తూ ప్రతి ఒక్కరికి సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సర్ కార్యక్రమంలో ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా భాగస్వామి కావాలని కోరారు. బిఎల్ఓలు అందజేసే ఎమ్యూనరేషన్ ఫారంలో తమ పూర్తివివరాలను సక్రమంగా నమోదుచేసి ఓటు హక్కును పరిరక్షించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలంటే ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఓటరుగా నమోదు కావడం అత్యంత ముఖ్యమని ప్రజలకు అవగాహన కల్పించారు.