తెలంగాణ ఎక్స్ ప్రెస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ డివిజన్‌లోని ఎస్.ఆర్. ఎస్టేట్స్ కమ్యూనిటీ హాల్‌లో గంగాధర శాస్త్రి, రమాదేవి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ శ్రీ జగదాంబిక వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 8వ రోజు నిర్వహించిన ప్రత్యేక వారాహి అమ్మవారి పూజా కార్యక్రమంలో కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం, వేద పండితుల ఆశీర్వాదాలు స్వీకరించి, తీర్థప్రసాదాలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో అడపా దుర్గా , మియాపూర్ డివిజన్ యువ నాయకులు యలమంచి ఉదయ్ కిరణ్, వెంకటేశ్వర్లు, బాబ్జీ, వంశీ, ప్రవీణ్, వాసు, రత్నాచారి, వినోద్ తదితర నాయకులు, భక్తులు, స్థానిక నివాసితులు పాల్గొన్నారు.