తెలంగాణ ఎక్స్ ప్రెస్ కామారెడ్డి జిల్లా (జూలై 24):కామారెడ్డి జిల్లా బిక్నూర్ పోలీస్ స్టేషన్లో బదిలీపై వచ్చి నూతన బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ ని అంతంపల్లి గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలకారు.
ఎస్సై మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు అందరూ సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా ఫోన్ చేసి వ్యక్తిగత సమాచారం అడిగితే,ఎవరైనా అపరిచితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. గ్రామంలో ఎటువంటి దొంగతనాలు, గొడవలు జరగకుండా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోని జాగ్రత్తగా ఉండి గ్రామంలో శాంతిభద్రతలు నెలకొల్పాలి అన్నారు.
ప్రజల తరఫున పోలీస్ శాఖకు పూర్తి సహకారం ఉండాలి.మన ప్రాంతంలో శాంతి భద్రతలు మరింత మెరుగుపడే విధంగా కృషి చేస్తాము అని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ మరియు సీటు బెల్టు వాడాలి మద్యపానం సేవించి వాహనాలు నడపకూడదు నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు ఉంటాయని ప్రజలకు హెచ్చరించారు.
అలాగే గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల అణచివేతకు మా వంతు పూర్తి సహకారం అందిస్తాము. “”యువతను చెడు మార్గాల నుండి కాపాడటానికి, గంజాయి మరియు అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్య క్రమంలో వీడిసీ అధ్యక్షులు వలకొండ గంగారెడ్డి పున్నా అఖిల్,కుంట అమృత రెడ్డి,తదితరులు పాల్గొనడం జరిగింది.
