Telangana Express News : రాజేంద్రనగర్‌లోని దేవరాజ్ భవన్‌లో శుక్రవారం రంగారెడ్డి జిల్లా భవన నిర్మాణ సంఘం నాలుగో మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో గిలక రాజును జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గిలక రాజు మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన జిల్లా ఏఐటిసి ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సంఘం అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి విధేయుడిగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
మహాసభలో సంఘం నాయకులు, సభ్యులు, కార్యకర్తలు   పాల్గొని నూతనంగా ఎన్నికైన గిలక రాజుకు శుభాకాంక్షలు తెలిపారు.