తెలంగాణ ఎక్స్ ప్రెస్: శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో కొమిరిశెట్టి ఫౌండేషన్ తరపున తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఖాజాగూడలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గచ్చిబౌలి డివిజన్ లోని 12 అంగన్‌వాడీ సెంటర్లకు అవసరమైన వస్తువులను పంపిణీ చేశారు. గిఫ్ట్ ఏ స్మైల్ ప్రెజెంట్ ఫర్ ఏ బెటర్ ఫ్యూచర్ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా అంగన్‌వాడీ పిల్లలకు, సిబ్బందికి ఉపయోగపడే సామాగ్రిని అందించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన అందరికీ కొమిరిశెట్టి ఫౌండేషన్ సభ్యులు కొమిరిశెట్టి సాయిబాబా ధన్యవాదాలు తెలియజేసారు.