
Telangana Express News : ఆషాఢ మాసం సందర్భంగా కాటేదాన్‌లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి గోరింటాకు (మెహిందీ) కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలు లేత ఆకుపచ్చ చీరలు ధరించి, చేతులకు గోరింటాకు అలంకరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, మహిళలు భక్తి పారవశ్యంతో పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. సంప్రదాయాన్ని, సంస్కృతిని ప్రతిబింబించే ఈ వేడుక భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సంప్రదాయాలను కాపాడుకుంటూ భక్తితో నిర్వహించే ప్రతి కార్యక్రమం సమాజంలో ఐక్యతను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తుంది అని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ సోమ శ్రీనివాస్ గుప్తా, చైర్మన్ అర్థం లక్ష్మయ్య గుప్తా, ప్రధాన కార్యదర్శి వీరబొమ్మ సురేష్ గుప్తా, కోశాధికారి కొండా కృష్ణయ్య గుప్తా, వర్కింగ్ ప్రెసిడెంట్ అర్థం శ్రీనివాసులు గుప్తా, అదనపు కార్యదర్శి గుడిపల్లి శేఖర్ గుప్తా , అలాగే బొగ్గారపు భారతమ్మ, సోమ నీరజ, అర్థం సంధ్యారాణి, బలుసా మౌనిక రాణి , మహిళలు పాల్గొన్నారు.
