తెలంగాణ ఎక్స్ ప్రెస్: శేరిలింగంపల్లి దివ్యాంగుల సమాఖ్య సంఘం ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి మండల ఎమ్మార్వో కార్యాలయంలో దివ్యాంగుల హక్కు చట్టం 2016బోర్డు ఏర్పాటు చేయాలని, ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో దివ్యాంగులకి 5%ఇండ్లు ఇవ్వాలని ఎమ్మార్వో మైపాల్ రెడ్డికి వినతిపత్రం అందజేసారు. అనంతరం, సంఘం అధ్యక్షులు మేకల అశోక్ కుమార్ ముదిరాజ్ మాట్లాడుతూ. దివ్యాంగుల హక్కు చట్టం 2016పూర్తిస్థాయిలో అమలు చేయాలని, అందులో సెక్షన్ 89 , 91 , 92 సెక్షన్ లపై అధికారులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, దివ్యాంగులపై దాడులు, దౌర్జన్యాలు, ఆస్తులపై దాడులు, దివ్యాంగుల హక్కులకు భంగం కలిగిస్తే తక్షణమే విచారణ జరిపించాలని, దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ ప్రైవేటు మండల సిఎంసి కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్ లో వీల్ చైర్ లను ఏర్పాటుచేసి ర్యాంపులు నిర్మించాలని, దానివలన పోలీస్ స్టేషన్ కు సమస్యలపై వచ్చిన దివ్యాంగులకు అనువుగా ఉంటుందని, ప్రభుత్వ కార్యాలయాలో దివ్యాంగుల హక్కు చట్టం నోటీస్ బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, శ్రీను, విజయ్ తదితరులు పాల్గొన్నారు.