తెలంగాణ ఎక్స్ ప్రెస్: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ, రాజీవ్ గృహకల్పలలో ఎస్.ఐ.ఆర్ ఓటు ఎన్యుమరేషన్ ప్రక్రియలో భాగంగా ఎస్.ఐ.ఆర్ ఓటు ఎన్యుమరేషన్ క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే తీరును పరిశీలించి ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేటర్లు నిర్వహిస్తున్న సర్వే వివరాలను అడిగి తెలుసుకునే కార్యక్రమంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, స్థానిక మహిళా నాయకురాళ్ళతో కలిసి శేరిలింగంపల్లి కాంగ్రేస్ పార్టీ ఉపాధ్యక్షురాలు మల్లెల జయ పాల్గొన్నారు. ఈ సందర్బంగ మల్లెల జయ మాట్లాడుతూ, ఎస్ఐఆర్ సర్వే అనేది చాలా కీలకమైన ప్రక్రియ అని ఈ డేటా ఆధారంగానే ఓటరు జాబితా తయారవుతుందని తెలిపారు.
