Oplus_131072

తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ :మహబూబాబాద్ జిల్లా అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు మంజూరు చేయాలని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా మహబూబా బాద్ జిల్లా ఆడహాక్ కమిటీ కన్వీనర్ హనుమండ్ల రామ కృష్ణరెడ్డి విజ్ఞప్తి చేశారు శనివారం జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల శాఖ అధికారి(డిపిఆర్ఓ) కార్యాలయంలో డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్‌ను ఆడహాక్ కమిటీ సభ్యులతో కలిసి జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సంద ర్భంగా హనుమండ్ల రామకృష్ణరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అనేక మంది జర్నలిస్టులు అర్హతలు ఉన్నప్పటికీ అక్రిడిటేషన్ కార్డులు పొందకుండా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొ న్నారు ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన ప్రతి జర్నలిస్టుకు ఎలాంటి వివక్షలేకుండా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు జర్నలిస్టులు సమాజానికి సమాచా రాన్ని చేరవేసే వారధులుగా పని చేస్తున్నారని వారి సేవలను గుర్తించి తగిన గౌరవం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు ఈ కార్య క్రమంలో సంఘటన కార్యదర్శి అంబాల కుమారస్వామి సంయుక్త కన్వీనర్లు పల్లె శ్రీనివాస్ బండ రాజ్ కుమార్ రాచగొల్ల సత్యనారాయణ కో-కన్వీనర్లు కొండి సాయి కిరణ్ మురుదొడ్డి కార్తీక్ దొంత పురుషోత్తం హెచ్. ప్రవీణ్ శివరామకృష్ణ తక్కెళ్ల పల్లి శ్రీనివాస్ ఆంగోతు లక్ష్మణ్ శ్రీరాంపసాద్ మిట్టగడుపుల మహేందర్ పాల్గొన్నారు.