తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ చేనేత ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 5న కరీంనగర్‌లోని పద్మశాలి కళ్యాణ మండపంలో నిర్వహించనున్న తెలంగాణ చేనేత చైతన్య మహాసభ పోస్టర్‌ను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, చేనేత రంగం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం, చేనేత పరిశ్రమ అభివృద్ధిపై చర్చించేందుకు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న తెలంగాణ చేనేత చైతన్య మహాసభకు చేనేత కార్మికులు, పద్మశాలి సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎలిగేటి శ్రీనివాస్ కోశాధికారి భీమనాతిని శారద, జిల్లా అధ్యక్షుడు మంచికట్ల కోటేశ్వర్ జిల్లా నాయకులు, గజేవల్లి కనుకయ్య, ఆడపు మునిందర్, చిందం అనిల్ తదితరులు పాల్గొన్నారు.
