హుస్నాబాద్, జూలై 26: తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 5న కరీంనగర్‌లో నిర్వహించనున్న తెలంగాణ చేనేత చైతన్య సభకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను నిర్వాహకులు ఆహ్వానించారు.

హుస్నాబాద్‌కు చెందిన చింతకింది శ్రీనివాస్, కరీంనగర్‌కు చెందిన భీమనాతి శారద, హుస్నాబాద్ పద్మశాలి సంఘ ప్రతినిధులు కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సభకు ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఆహ్వానాన్ని స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఆగస్టు 5న కరీంనగర్‌లో జరిగే తెలంగాణ చేనేత చైతన్య సభకు హాజరవుతానని హామీ ఇచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.

చేనేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి, పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ చైతన్య సభలో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలంగాణ చేనేత ఐక్యవేదిక ప్రతినిధులు వెల్లడించారు.

Avatar photo

By Murthy