వరంగల్, జూలై 27 (తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్): నూతన వరంగల్ జిల్లా డీసీసీ కార్యదర్శిగా ఎన్నికైన మంత్రి కమలాకర్ నేతను అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కమర్త మురళి సోమవారం ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకు కృషి చేస్తూ పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

మంత్రి కమలాకర్ నేతకు ఈ బాధ్యతలు రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన నాయకులు, ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కమలాకర్ నేత వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.