తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్తి గార్డెన్స్‌లో ⁠తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ ఆధ్వర్యంలో జిల్లా సర్పంచుల చైతన్య సదస్సు ఉమ్మడి వరంగల్ జిల్లా సర్పంచ్ల ఫోరం కన్వీనర్ గునిగం టి కమలాకర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించబడింది సర్పం చుల చైతన్య సదస్సుకు ముఖ్య అతిథిలు సర్పంచులు మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధిలో సర్పంచుల పాత్రను మరింత బలోపేతం చేయడం స్థానిక సంస్థల హక్కులను కాపాడటమే ధ్యేయంగా ఈ సదస్సును ఏర్పాటు చేశారు జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి సర్పంచులు ఈ సమావే శానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు సర్పంచులు తమ రోజువారీ విధుల్లో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఈ వేదికగా సుదీర్ఘంగా చర్చించారు గ్రామపంచాయతీల బలో పేతానికి అవసరమైన నిధుల విడుదల స్థానిక సంస్థల అధికారాల పరిరక్షణపై సర్పంచులకు సమగ్ర అవగాహన కల్పించారు గ్రామాల్లో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు ఈ సమావేశా నికి ముఖ్య అతిధి తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు ఎదుర్కొంటున్న సమ స్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 1989లో గ్రామ పంచాయతీ లకు 29 అంశాలను ప్రవేశ పెట్టడం జరిగింది. పలు రాష్ట్రాలు గ్రామ పంచాయతీలోని అంశాలను నెరవేర్చా లని ఈ సందర్భంగా చెప్పారు గత ప్రభుత్వంలో 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణ ద్వారా గ్రామ పంచాయతీ లకు బదలాయించింది గ్రామపంచాయతీ లోనీ వనరులు గ్రానైట్ భూముల కయ విక్రయాలు వచ్చే ఆదాయాలను నేరుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఈ సద స్సులో రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు గ్రామాలలో అభివృద్ధికి అడ్డుప డుతున్న ఉపసర్పంచ్ లకు చెక్ పవర్ రద్దు చేయాలని గ్రామపంచాయతీ కరెంట్ బిల్లులను కూడా రాష్ట్ర ప్రభుత్వ మే భరించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి నెలలో ఒక్కరోజు కలెక్టర్లు జిల్లాలోని సర్పంచ్లతో ఒక సమావేశం ఏర్పాటు చేసి గ్రామాలలో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా దృష్టి సారించాలి ఎమ్మెల్సీ ఎలక్షన్లో సర్పంచులకు కూడా ఓటు హక్కు కల్పించాలి ఆరు నెలల కు ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సర్పంచ్లతో మీటింగ్ ఏర్పాటు చేయాలి ఈ కార్యక్ర మంలో రాష్ట్ర నాయకులు మందిపల్లి వెంకట్ రాష్ట్ర కార్య దర్శి నరేందర్ శ్రీనివాస్ గునుగంటి కమలాకర్ గౌడ్ ఉమ్మ డి వరంగల్ జిల్లా సర్పంచుల ఫోరం కన్వీనర్ సర్పంచులు పెరుమాండ్ల గుట్టయ్య ప్రవీణ్ నాయక్ విజేందర్ అయూబ్ పాషా ఏకాంతం గౌడ్ కొత్త హేమంత్ ఆయుఖాన్ కాల్ నాయక్ పృథ్వీరాజ్ పార్వతి లక్ష్మణ్ నాయక్ వివిధ గ్రామాల చెందిన సర్పంచులు పాల్గొన్నారు.