తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ డివిజన్, రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ మాక్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ లోని ప్రాథమిక సమస్యలను పీఏసీ చైర్మెన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీతో మాక్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా విన్నవించారు. ఈ సందర్బంగ ఎమ్మెల్యే సానుకూలంగా స్పందింస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు, సభ్యులు ,తదితరులు పాల్గొన్నారు.
