తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ : శేరిలింగంపల్లి డివిజన్, రాజీవ్ గృహకల్పలో మాజీ చైర్ పర్సన్, తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు శ్రీమతి సుజాత యాదవ్, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సొంత ఖర్చులతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శ్రీ షిర్డీ సాయినాథ, మార్కండేయ స్వామి, సంతాన నాగదేవత ఆలయంలో గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గురువుల ఆశీస్సులతో ప్రజాసేవ చేసే అవకాశం కల్పించాలని శేరిలింగంపల్లి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.