తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: గురుపౌర్ణమి సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బండి రమేష్ గారు తన సతీమణి, కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఉన్న దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక అభిషేకం, పూజా కార్యక్రమాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం, బండి రమేష్ మాట్లాడుతూ, గురుపౌర్ణమి భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన పర్వదినమని, గురువుల ఆశీస్సులు ప్రతి ఒక్కరి జీవితానికి దిశానిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. సమాజంలో సనాతన విలువలను, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించే ఇటువంటి పర్వదినాలను ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
