తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఆల్విన్ కాలనీ డివిజిన్ పరిధిలోని దత్తత్రయ నగర్ కాలనీలోని శ్రీశ్రీశ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఉత్సవాలకు ముఖ్య అతిధిగా డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై హారతి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం, ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
