తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని అనేక దేవాలయాల్లో ఘనంగా నిర్వహించిన బోనాల పండుగ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనాల మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లను ఘనంగా చేపట్టిందని, బోనాల పండుగ మన భక్తి, ఐకమత్యం, సామాజిక సామరస్యానికి ప్రతీకని, ఈ పండుగను ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో, సంప్రదాయాలను గౌరవిస్తూ, పరస్పర సహకారంతో ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.