తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: కొండాపూర్ డివిజన్ పరిధిలో వైశాలి నగర్ సమీపంలోని రైల్వే అండర్‌పాస్ వద్ద ఇటీవల జరిగిన ప్రమాదంలో నాలాలో గల్లంతైన ప్రేమ్ నగర్ బీ బ్లాకు కాలనీకి చెందిన బాలయ్య70సం. కుటుంబాన్ని పిఏసీ చైర్మన్, ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ, కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలసి అధికారులు, ప్రజా ప్రతినిధులు పరామర్శించారు. జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ మాలెంపాటి, డిప్యూటీ కమిషనర్ సేవా ఇస్లావత్ , తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, పలు అధికారులు కలిసి బాధిత కుటుంబాన్ని వారి నివాసంలో పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబానికి రూ2రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని, అవసరమైన ప్రభుత్వ సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసినందుకు , ఆ కుటుంబానికి అండగా నిలిచినందుకు ప్రజా ప్రతినిధులకు, అధికారులకు స్థానిక ప్రజలందరూ కృతజ్ఞతలు తెలిపారు.