తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : గండిపేట మండల పత్రిక విలేకరుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు సోమవారం రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సలీం పాషా సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా జి. రాము యాదవ్ (వార్త), ఉపా ధ్యక్షులుగా గోపాల్ (సూర్య), టి. సత్యం గౌడ్ (సాక్షి), బి. ప్రవీణ్ యాదవ్ (దిశ), ప్రధాన కార్యదర్శిగా ఎస్. నరేందర్ (తెలుగు ప్రభ), సంయుక్త కార్య దర్శులుగా ఎ. శివకుమార్ (ప్రజా సాక్షి), ఎస్. ప్రభాకర్ (మన తెలంగాణ), జి. నరేష్ కుమార్ (నవ తెలంగాణ), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జి. విజయ్ కుమార్ (ఆంధ్రప్రభ), కార్యవర్గ సభ్యుడిగా ఎన్. రామకృష్ణ (క్యూ న్యూస్) ఎన్నికయ్యారు. ఈసీ సభ్యులుగా విజయ్ ప్రతాప్, దాసరి రవి కుమార్, లక్ష్మీనారాయణ, శ్యామ్ కుమార్, సుగ్రీవ్ ఎన్నిక కాగా, గౌరవ సలహా దారులుగా రాజేందర్ రెడ్డి, రాజు, విష్ణు, సత్య కుమార్‌లను నియమించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సలీం పాషా మాట్లాడుతూ విలేకరుల సంక్షేమం, వృత్తి హక్కుల పరిరక్షణ, ఐక్యతకు సంఘం కట్టుబడి పనిచేయాలని ఆకాంక్షించారు. నూతన కార్యవర్గ సభ్యులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మండలంలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.