తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన ముక్కా పృథ్వీ కుమార్ నూతన కార్యదర్శిగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ యువజన విభాగానికి ఎన్నికైనారు. ఈ సందర్బంగ పలువురు ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు, సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ యువజన విభాగానికి నూతన కార్యదర్శిగా ఎన్నికైన ముక్కా పృథ్వీ కుమార్ ను గౌరవప్రదంగా సత్కరించి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం, ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు, సభ్యులు మాట్లాడుతు, రాష్ట్ర స్థాయిలో అంతటి ప్రాధాన్యత కలిగిన పదవి దక్కడం అసాధారణ విషయమని, ఇది శేరిలింగంపల్లి ఆర్యవైశ్యులకు గర్వకారణమని ప్రశంసించారు. ఈ సందర్భంగా ముక్కా పృథ్వీ కుమార్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి, యువజన నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ, శిరుప అనిల్ , చంద్రశేఖర్ , పవన్, రంగారెడ్డి జిల్లా కార్యవర్గానికి, మండల సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మాశెట్టి ప్రభాకర్, కొండూరి జగన్మోహన్, శేరిలింగంపల్లి మండల సభ్యుల పూర్తి సహకారం, ప్రోత్సాహంతోనే తనకు ఈ గుర్తింపు లభించిందని పృథ్వీ కుమార్ వివరించారు. ఆర్యవైశ్య సంఘ బలోపేతానికి, యువత సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు దొగుపర్తి నాగమల్లేశ్వరరావు, గజవాడ లక్ష్మీనరసింహారావు తదితరులు పాల్గొని పృథ్వీ కుమార్ ను ఘనంగా సత్కరించి, అభినందనలు తెలియజేశారు.
