తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  పీఎం శ్రీ  పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన పలు కార్యక్రమాల కింద కేటాయించిన నిధులను వెంటనే వినియోగించాలని రాష్ట్ర పీఎం శ్రీ బృందం సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ (ఎస్‌పీడీ) జిల్లా విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఆమోదించిన నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాలలో వార్తాపత్రికలు, మాసపత్రికలు (రూ.10,000), స్పోకెన్ ఇంగ్లీష్ కార్యక్రమం (రూ.10,000), కళలు–హస్తకళల సామగ్రి (రూ.20,000), ఎకో క్లబ్ – మిషన్ లైఫ్ (రూ.10,000), ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం (రూ.10,000), ప్రీ-ప్రైమరీ విద్యార్థులకు టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్ (విద్యార్థికి రూ.500), ఉపాధ్యాయులకు టీఎల్ఎం (ఉపాధ్యాయుడికి రూ.500), విద్యార్థి గుర్తింపు కార్డులు (విద్యార్థికి రూ.70) కోసం నిధులు వినియోగించాల్సి ఉంటుంది. అదేవిధంగా గ్రీన్ స్కూల్ కార్యక్రమం కింద రంగుల డస్ట్‌బిన్లు (రూ.10,000), ఎల్‌ఈడీ లైట్లు (రూ.20,000), నర్సరీ పనిముట్లు (రూ.20,000), ఔషధ మొక్కల తోట (రూ.5,000), కంపోస్టింగ్ సదుపాయం (రూ.1,00,000), ప్రథమ చికిత్స కిట్ (రూ.2,000), పర్యావరణహిత గ్రో బ్యాగులు (రూ.10,000) కోసం కూడా కేటాయించిన నిధులను పీఎం శ్రీ మార్గదర్శకాల ప్రకారం తక్షణమే ఖర్చు చేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా ఈ నిధులను సక్రమంగా వినియోగించాలని రాష్ట్ర పీఎం శ్రీ బృందం ప్రధానోపాధ్యాయులకు సూచించింది.