తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :తెలంగాణ రాష్ట్ర రోడ్డురవాణ సంస్థ లో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలను అధికారులు విడుదల చేశారు. మొత్తం 1,743 పోస్టులకు గాను 1,604 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వివరాల ప్రకారం1,000 డ్రైవర్ పోస్టులకు 894 మంది, 743 శ్రామిక్ పోస్టులకు710 మంది ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 17వతేదీలోపు తమకు సంబంధించిన పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సర్టిఫికెట్ల ధ్రువీకరణ (సర్టిఫికెట్ వెరిఫికేషన్ ) పూర్తి చేయాలని అధికారులు సూచించారు.