తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్ ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆషాడ మాస బోనాల పండుగల సందర్భంగా ఆదర్శ్ నగర్ కాలనీలోని శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం నుండి నెహ్రూనగర్, గోపినగర్ మీదుగా ఫలహారం బండి ఊరేగింపు ఘనంగా జరిగింది. ఈ ఊరేగింపులో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊరేగింపులో పోతురాజులు, వివిధ వేషధారణలతో భక్తులు కళ్లకు కట్టినట్టుగా ఆకట్టుకున్నారు. డప్పు చప్పుళ్లు, బోనాల జాతర సందడితో ఆదర్శనగర్, నెహ్రూనగర్, గోపినగర్ ప్రాంతంలో భక్తిభావంతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.