తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ సర్ ‘ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించే లక్ష్యంతో రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్వో) శ్రీనివాస్ రెడ్డి, బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆల్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు సర్ ప్రక్రియ అమలు, ఓటరు జాబితా ప్రత్యేక పరిశీలన, కొత్త దరఖాస్తుల స్వీకరణ, అభ్యంతరాల పరిష్కారం, రాజకీయ పార్టీలతో సమన్వయం తదితర అంశాలపై సవివరంగా వివరించారు. ఓటరు జాబితా ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సర్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు తమ పూర్తి సహకారాన్ని అందిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి, బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు మహేష్ యాదవ్, కిస్మత్‌పూర్ మాజీ ఉపసర్పంచ్, రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యుడు నిరుడు శేఖర్ ముదిరాజ్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.