తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :

రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలర్ దేవ్ పల్లి లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీ వెంకన్న గుట్టలో పంచంతస్తుల రాజగోపుర నిర్మాణ పనులు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో చేపట్టిన ఈ మహత్తర నిర్మాణంలో ఇప్పటికే మూడో అంతస్తు పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం నాలుగో అంతస్తు నిర్మాణ పనులు వేగంగా జరుగు తున్నాయి. ఈ పవిత్రమైన రాజగోపుర నిర్మాణ కార్యక్రమంలో ప్రతి భక్తుడు భాగస్వామి కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు. భక్తులు తమ శక్తి మేరకు ధనరూపంలో లేదా నిర్మాణ సామగ్రి రూపంలో విరాళాలు అందించి ఈ దివ్య కార్యానికి సహక రించాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల సహకారంతో నిర్మితమయ్యే ఈ రాజగోపురం భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మిక వారసత్వంగా నిలవనుంది. దైవ సేవలో భాగస్వాములయ్యే ప్రతి ఒక్కరిపై ఏడుకొండల శ్రీ వేంకటేశ్వర స్వామివారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆలయ కమిటీ ఆకాంక్షించారు.