తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: రాయదుర్గం గ్రామంలో గౌడ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఏఐసీసీ నాయకులు మధుయాష్కి గౌడ్ ,మాజీ పార్లమెంట్ సభ్యులు బుర్ర నర్సయ్య గౌడ్, మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్, మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ , అశోక్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, రాయదుర్గం గౌడ్ సంఘం అధ్యక్షులు రాములు గౌడ్ లతో కలిసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సర్దార్ సర్వాయి పాపన్న అధికారాన్ని అనుభవించడానికి కాదు, ప్రజల హక్కులను కాపాడడానికి పోరాడిన మహానాయకుడు అని, అన్యాయాన్ని ఎదిరించి, అణచివేతకు వ్యతిరేకంగా నిలబడి, సమానత్వం కోసం పోరాడిన ఆయన జీవితం ప్రతి తెలంగాణ బిడ్డకు స్ఫూర్తి అని అన్నారు.