తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నివాసంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ కాంగ్రెస్ బాధ్యులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో కీలక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, శంకరయ్య, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి సంపత్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజీవ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో ప్రజా ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అలాగే, త్వరలో ఖాళీ కానున్న పట్టభద్రుల శాసనమండలి సభ్యుల స్థానానికి అభ్యర్థి ఎంపిక, సహకార సంఘాల ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరించాలని దామోదర్ రాజనర్సింహ సూచించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆశావహుల వివరాలతో పాటు ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన అభ్యర్థుల పేర్లను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి పంపించాలని సమావేశంలో నిర్ణయించారు.
