తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మహోన్నత ప్రజాకవి, ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతి సందర్భంగా వినమ్ర నివాళులు అర్పిస్తున్నట్లు రాజేంద్రనగర్ నియోజకవర్గ బాధ్యుడు, ది నేషనల్ అంబేద్కర్ సేన నాయకుడు పంబాల రాజు రాజేష్ తెలిపారు.
ప్రజలను తన పాటలతో చైతన్యపరిచి, సమానత్వం, సామాజిక న్యాయం, మానవ హక్కులు, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడిగా గద్దర్ చరిత్రలో నిలిచిపోయారని ఆయన పేర్కొన్నారు. గద్దర్ జీవితం, ఆశయాలు, ఉద్యమ స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.
గద్దర్ చూపిన సమానత్వం, సోదరభావం, సామాజిక న్యాయం అనే ఆదర్శాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల సాధనకు సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజం కోసం గద్దర్ అందించిన సేవలు, చేసిన త్యాగాలు చిరస్మరణీయమని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా “గద్దర్ ఆశయాలు చిరస్థాయిగా నిలవాలి… డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చూపిన రాజ్యాంగ మార్గంలో సమానత్వ సమాజ నిర్మాణమే గద్దర్‌కు నిజమైన నివాళి” అని పంబాల రాజు రాజేష్ పేర్కొన్నారు.
