తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలర్ దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని భావన ఋషి కాలనిలో ఉన్న శ్రీ పోచమ్మ దేవాలయంలో ఈ నెల 9వ తేదీ ఆదివారం జరగనున్న బోనాల మహోత్సవాల ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. గురువారం దేవాలయానికి రంగుల ద్దింపు పనులను ప్రారంభించారు. ఆలయాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు రంగులద్దింపు, విద్యుత్ అలంకరణ, పుష్పాలంకరణ తదితర పనులు చేపట్టారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుడు సామల యాదయ్య మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం భక్తుల సహకారంతో బోనాల వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది కూడా అమ్మవారి ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేసి భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. బోనాల సందర్భంగా ప్రత్యేక పూజలు, బోనం సమర్పణ, పోతరాజుల విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
