తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ అధికంగా కొనసాగింది. మొత్తం 77,502 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 34,485 మంది తలనీలాలు సమర్పించారు.
శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.46 కోట్లు నమోదు కాగా, 4.24 లక్షల లడ్డూలు విక్రయించబడ్డాయి. అన్నప్రసాద కేంద్రాల ద్వారా 2.50 లక్షల మంది భక్తులకు ఉచిత భోజన సదుపాయం కల్పించారు.
అశ్విని ఆసుపత్రిలో 2,926 మంది భక్తులకు వైద్య సేవలు అందించారు. భక్తుల రద్దీ కారణంగా వేచి ఉండే కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో, క్యూలైన్ శిలాతోరణం వెలుపల వరకు కొనసాగుతోంది.
ప్రస్తుతం ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులకు సుమారు 20 నుంచి 24 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. తిరుమలకు వచ్చే భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.
